మన సోమరాజు కోనేరు కాపాడుకుందాం! జి.అగ్రహారం

మన సోమరాజు కోనేరు కాపాడుకుందాం! జి.అగ్రహారం

12/October/2026 21:51    Share:   

చీపురుపల్లి:

చీపురుపల్లి పట్టణంలోని జి.అగ్రహారం గ్రామంలో ఉన్న చారిత్రాత్మక సోమరాజు కోనేరు ఆక్రమణల నుండి కాపాడేందుకు చేపట్టిన పోరాటం కీలక దశకు చేరుకుంది.

2021 సంవత్సరం నుండి కోనేరు ఆక్రమణలను అడ్డుకుంటూ జనసేన పార్టీ చీపురుపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గౌ|| శ్రీ విసినిగిరి శ్రీనివాసరావు గారు నిరంతరం పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా ఈరోజు రెవెన్యూ సిబ్బందితో కలిసి కోనేరు వద్దకు వెళ్లి కోనేరును పరిరక్షించి, దాని చుట్టూ వాకింగ్ ట్రాక్, సుందరమైన పార్క్ ఏర్పాటు చేసి జి.అగ్రహారం ప్రజలకు ఆహ్లాదకరమైన ప్రదేశంగా అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని శ్రీనివాసరావు గారు తెలిపారు.

మంగళవారం రెవెన్యూ సిబ్బంది అధికారికంగా సర్వే నిర్వహించి, సోమరాజు కోనేరుకు హద్దులు నిర్ణయించి ప్రజలకు అప్పగించనున్నారు.కావున జి.అగ్రహారం గ్రామ ప్రజలు, యువత, పెద్దలు అందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ మంచి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.



Breaking News

Subscribe our Newsletter