అనకాపల్లిలో ఘనంగా ‘పద్మమ్ సిల్వర్ జ్యువలరీ’ 14వ బ్రాంచ్ ప్రారంభం!

అనకాపల్లిలో ఘనంగా ‘పద్మమ్ సిల్వర్ జ్యువలరీ’ 14వ బ్రాంచ్ ప్రారంభం!

14/April/2026 06:38    Share:   

అనకాపల్లి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రముఖ ఆభరణాల సంస్థ 'పద్మమ్ సిల్వర్ జ్యువలరీ' 14వ బ్రాంచ్ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ప్రముఖ నాయకులు పీలా గోవింద సత్యనారాయణ, మళ్ళ సురేంద్ర, దాడి రత్నాకర్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేసి షోరూమ్‌ను లాంఛనంగా ప్రారంభించారు.షోరూమ్ ప్రారంభోత్సవం అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా, సరికొత్త ఆధునిక డిజైన్లతో వెండి ఆభరణాలు అనకాపల్లి వాసులకు అందుబాటులోకి రావడం ఎంతో ఆనందదాయకమని హర్షం వ్యక్తం చేశారు. కేవలం వ్యాపార దృక్పథంతోనే కాకుండా నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా, వినియోగదారుల నమ్మకాన్ని చూరగొనేలా వ్యాపారాన్ని దినదినాభివృద్ధి చేసుకోవాలని యాజమాన్యానికి సూచించారు.ఈ సందర్భంగా షాప్ యాజమాన్యం తమ స్పందనను తెలియజేస్తూ.. వినియోగదారులకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన వెండి ఆభరణాలను అందించడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మార్కెట్లోకి వస్తున్న కొత్త డిజైన్లను అందరికీ అందుబాటులో ఉండేలా సరసమైన ధరలకే అందిస్తామని వారు హామీ ఇచ్చారు.ఈ కోలాహలమైన ప్రారంభోత్సవ వేడుకలో స్థానిక వ్యాపారవేత్తలు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, అభిమానులు, అనకాపల్లి పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని యాజమాన్యానికి తమ శుభాకాంక్షలు తెలియజేశారు.
శ్రీనివాస్ రావు . ఎ క్రైమ్ ఎనాలసిస్ , జిల్లా ఇంచార్జ్,అనకాపల్లి.
Breaking News

Subscribe our Newsletter