ఎన్యూమరేషన్ ఫారంలు డిజిటైజేషన్ 94. 34 శాతం పూర్తి  జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ.  

ఎన్యూమరేషన్ ఫారంలు డిజిటైజేషన్ 94. 34 శాతం పూర్తి  జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ.  

16/July/2026 19:18    Share:   

ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై అధికారులతో  జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష 
 
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు,
ఏలూరు,జిల్లాలో  ఎన్యూమరేషన్ ఫారంల డిజిటైజేషన్  94. 34 శాతం పూర్తి చేశామని, మిగిలిన ఎన్యూమరేషన్ ఫారంల డిజిటైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలనీ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె.అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. 
స్థానిక కలెక్టరేట్ నుండి బుధవారం ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) -2026 కార్యక్రమం ప్రగతిపై   ఈఆర్ఓ లు, ఏ ఈఆర్ఓ లతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ  మాట్లాడుతూ  బిఎల్ఓ లు తప్పనిసరిగా ప్రతీ ఇంటికి మూడుసార్లు వెళ్లి సమాచారం సేకరించాలన్నారు.  అర్హత ఉన్న ఏ ఒక్కరికీ ఓటు రద్దు కాకుండా   ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) -2026 కార్యక్రమాన్ని నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయాలన్నారు.    16 లక్షల 44 వేల  193 మంది ఓటర్లకు నూరుశాతం ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశామని, వాటిలో 94. 34 శాతం మేర   15 లక్షల 51 వేల  083 ఫారాలు  ఎన్యూమరేషన్ ఫారంలు డిజిటైజేషన్ చేయడం జరిగిందన్నారు.  జిల్లాలో  డెత్, షిఫ్టింగ్, శాశ్వత వలసదారులకు సంబందించి 93 వేల 110 వారి వివరాలు సేకరించవలసి ఉందని, వాటిపై   ఈఆర్ఓ, ఏఈఆర్ఓలు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు.     అన్ని నియోజకవర్గాలలో బి ఎల్ ఓ స్థాయిలో తయారుచేసిన ASD రిజిస్టర్ను సంబంధిత బిఎల్ఓ., తహసీల్దార్, ఎంపిడిఓ లు సంతకం చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. ఎన్యూమరేషన్ ఫారంల డిజిటైజేషన్, మాపింగ్ లలో వెనుకబడిన ఈఆర్ఓ లు, ఏఈఆర్ఓ లు  త్వరితగతిన    పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని జేసీ అభిషేక్ గౌడ అధికారులను  ఆదేశించారు.
ఇంచార్జ్ డిఆర్ఓ దేవకీదేవి, నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, జిల్లా పరిషత్ సీఈఓ జగదాంబ,  ఆర్డీఓ లు లక్ష్మీప్రసన్న, రమణ, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ . భానుప్రతాప్,  స్వర్ణ గ్రామ/వార్డ్ సచివాలయాలు ప్రత్యేక అధికారి నాయుడు, ఈఆర్ఓ లు, ఏఈఆర్ఓ లు, తహసీల్దార్లు, ఎంపిడిఓలు, బిఎల్ఓ లు, ప్రభృతులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter