పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది ఎంపీ కలిశెట్టి..

పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది ఎంపీ కలిశెట్టి..

19/September/2026 18:13    Share:   

రణస్థలం, సెప్టెంబర్ 19:
రణస్థలం మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనగర్‌లో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ లంక శ్యామలరావు, సీనియర్ నాయకులు చౌదరి నారాయణమూర్తి, మండల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ కలిశెట్టి మాట్లాడుతూ పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అన్నారు. ఇళ్లు, రోడ్లు, కాలనీలు, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు చెత్తను సక్రమంగా నిర్వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని, స్వచ్ఛతను కార్యక్రమంగా కాకుండా నిత్య జీవన విధానంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.

క్రైమ్ ఎనాలసిస్ విజయనగరం జిల్లా ఇంచార్జ్ మందపాటి సూర్యనారాయణ రాజు
Breaking News

Subscribe our Newsletter