పాఠశాలకు సోలార్ వెలుగులు,కాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వంటెద్దు సురేష్

పాఠశాలకు సోలార్ వెలుగులు,కాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వంటెద్దు సురేష్

26/March/2026 16:37    Share:   

విద్య తోనే సామాజిక ప్రగతి
- సందడి వాతావరణంలో కాజ్ ఫౌండేషన్ ప్రారంభోత్సవం
- విద్యా వ్యవస్థ బలోపేతానికి తమదైన పాత్ర పోషిస్తామని పునరుద్ఘాటన
అనకాపల్లి రూరల్: నాణ్యమైన విద్య అందించడంతో పాటు అంకిత భావంతో పని చేసే ఉపాధ్యాయులు ఉన్నప్పుడే విద్యార్థుల కలలు సాకారం అవుతాయని కాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వంటెద్దు సురేష్ అన్నారు. అనకాపల్లి మండలం ఎరుకులవానిపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో కాజ్ ఫౌండేషన్ సేవలను గురువారం లాంఛనంగా ప్రారంభించారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, పాఠశాల హెచ్ఎం కొణతాల ఫణిభూషణ శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యోపకరణ కిట్లు, పండ్లు పంపిణీ చేశారు. దివంగతులైన తమ కుటుంబ సభ్యులు కల్లివిల్లి కూర్మయ్య, వంటెద్దు అప్పారావు, వంటెద్దు జగన్నాథం జ్ఞాపకార్థం పాఠశాలకు సోలార్ లైట్లు, రానున్న విద్యా సంవత్సరం నాటికి ఓపెన్ లైబ్రరీ(స్వేచ్ఛా గ్రంథాలయం) నిర్మాణం చేపట్టనున్నట్లు వ్యవస్థాపకులు ప్రకటించారు. విద్యా ద్వారా సామాజిక ప్రగతి సాధనకు ముందడుగు కాజ్ ఆవిష్కరణ ఉద్దేశాన్ని హెచ్ఎం అభినందించారు. కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ అరిగా శ్రీనివాసరావు, సభ్యులు శివప్రసన్న కుమార్ అవధూత, ఉపాధ్యాయులు కేఎన్ మూర్తి, బీవైఎస్ఎన్ కృష్ణారావు, డి.శ్రీలత, జి.ఉమ, కె.కుమారి, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు, సన్జో ఎనర్జీస్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter