నిరుపేదల సంక్షేమమే ధ్యేయం,ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌తో కుటుంబాలకు అండగా కూటమి ప్రభుత్వం..!

నిరుపేదల సంక్షేమమే ధ్యేయం,ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌తో కుటుంబాలకు అండగా కూటమి ప్రభుత్వం..!

01/May/2026 13:34    Share:   

(క్రైమ్ అనాల్సిస్ |రిపోర్టర్ కే. ఆనంద్ - ఏటికొప్పాక)

యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో నిరుపేద కుటుంబాల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం మరో కుటుంబానికి అండగా నిలిచింది. అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక గ్రామంలో భర్త మృతి చెందడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి ప్రభుత్వం వెంటనే స్పందించింది.మరణించిన వ్యక్తికి అందుతున్న పెన్షన్‌ను కుటుంబ సభ్యురాలి పేరుపై బదిలీ చేసి, ఆమెకు ఆర్థిక భరోసా కల్పించింది. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కాండ్రకోట చిరంజీవి, సర్పంచ్ కుమారుడు భజంత్రీల శ్రీను, డిజిటల్ అసిస్టెంట్ నూకరాజు కలిసి లబ్ధిదారురాలికి పెన్షన్ అందజేశారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, ఇలాంటి సంక్షేమ పథకాలు మరింత మంది అర్హులైన నిరుపేదలకు చేరాలని ఆకాంక్షించారు.
“పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తాం” అని స్థానిక నాయకులు తెలిపారు.
Breaking News

Subscribe our Newsletter