ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది కానుక - 10,060 పోస్టులతో

ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది కానుక - 10,060 పోస్టులతో 'జాబ్ క్యాలెండర్' విడుదల

20/March/2026 07:28    Share:   

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు ఉగాది పర్వదినం సందర్భంగా ప్రజా ప్రభుత్వం తీపి కబురు అందించింది. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు, రాష్ట్రంలోని నిరుద్యోగుల కలలను సాకారం చేస్తూ 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వార్షిక జాబ్ క్యాలెండర్‌ను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది
మొత్తం పోస్టులు: వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 ఉద్యోగాలను ఈ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయనున్నారు.
పారదర్శకత: ఏ తేదీన నోటిఫికేషన్లు వస్తాయి, ఎన్ని పోస్టులు ఉంటాయి అనే పూర్తి వివరాలను స్పష్టంగా క్యాలెండర్‌లో పొందుపరిచారు.
సమయపాలన: నిర్దేశిత గడువులోనే పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి మరియు నియామక ప్రక్రియ పూర్తి చేయబడుతుంది.
ముందస్తు సిలబస్: అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్షల సిలబస్‌ను కూడా ముందుగానే ప్రకటించడం జరుగుతుంది.
ఉద్యోగార్థులందరూ ప్రభుత్వం రూపొందించిన నైపుణ్యం పోర్టల్‌ (Skill Portal) నందు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) చేసుకోవాలి. దీని ద్వారా నోటిఫికేషన్లకు సంబంధించిన ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ మరియు అలర్ట్స్ నేరుగా పొందవచ్చు.
రాష్ట్ర యువత అంతా ఉత్సాహంతో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని కోరుతూ, ఉద్యోగార్థులందరికీ ప్రభుత్వం తరపున ఉగాది శుభాకాంక్షలు తెలియజేయడమైనది.

Breaking News

Subscribe our Newsletter