ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 2న కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయండి: సీపీఎం 

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 2న కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయండి: సీపీఎం 

26/March/2026 13:42    Share:   

అచ్చుతాపురం మండలంలో ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలు, నిర్వాసితుల కష్టాలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 2న అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు  మాట్లాడుతూ, మండలంలోని పేదలు సాగు చేసుకుంటున్న వెదురువాడ సర్వే నెంబర్  ఇతర ప్రాంతాల పేదల భూములకు తక్షణమే రీ-సర్వే నిర్వహించి, సాగుదారులకు హక్కులు కల్పించాలని,దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఇనాం భూములను జిరాయితీ భూములుగా మార్చి, లబ్ధిదారులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని, ఎస్సీ జెడ్ నిర్వాసితులకు పెండింగ్ సమస్యలు మేజర్ సన్స్ కు ఇంటి స్థలాలు ఇవ్వాలని
బార్క్ ప్రాజెక్టు వల్ల నివాసాలు,జీవనోపాధి కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి.వారికి రావలసిన నష్టపరిహారం,పునరావాస ప్యాకేజీలను తక్షణమే పరిష్కరించాలి.కాలుష్య కోరల్లో చిక్కుకున్న దుప్పితురు, చినపూడి గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి,గ్రామస్తులకు అన్ని వసతులతో కూడిన పునరావాసం కల్పించాలని.
మత్స్యకారుల చిరకాల స్వప్నమైన పూడిమడక జెట్టి నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని.​రోడ్డు నిర్వాసితులకు న్యాయంరోడ్డు విస్తరణలో ఇళ్లు,భూములు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించి,నష్టపరిహారం చెల్లించాలని. వీటితోపాటు మండలంలో పింఛన్లు రేషన్ కార్డులు ఇంటి స్థలాలు ఇంటి నిర్మాణంకు స్కీము లో ఇవ్వాలని ​ప్రభుత్వాలు మారుతున్నా అచ్చుతాపురం మండల ప్రజల సమస్యలు మాత్రం కాగితాలకే పరిమితమవుతున్నాయని వారు విమర్శించారు. ఈ ప్రజా వ్యతిరేక ధోరణిని నిరసిస్తూ, హక్కుల సాధన కోసం ఏప్రిల్ 2న జరిగే కలెక్టరేట్ ముట్టడికి బాధితులు, సామాన్య ప్రజలు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని సీపీఎం  కోరుతోంది. ఈ కార్యక్రమంలో సిపిఎం అచ్యుతాపురం కన్వీనర్ ఆర్ రాము ,కె సోమనాయుడు, మైలపల్లి అప్పారావు, మైలపల్లి దానప్ప తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter