డీఎంకేకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. దళపతి విజయ్ టీవీకేతో దోస్తీ!

డీఎంకేకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. దళపతి విజయ్ టీవీకేతో దోస్తీ!

06/May/2026 16:48    Share:   

తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పు చోటుచేసుకుంది. దశాబ్దాలుగా డీఎంకే (DMK)తో కొనసాగుతున్న బంధాన్ని తెంచుకున్న కాంగ్రెస్ పార్టీ, నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) ప్రభుత్వ ఏర్పాటుకు అధికారికంగా మద్దతు ప్రకటించింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. 
  • పొత్తు అధికారికం: ఏఐసీసీ తమిళనాడు ఇంచార్జ్ గిరీష్ చోడంకర్ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ పొత్తు కేవలం ప్రభుత్వ ఏర్పాటుకే కాకుండా, భవిష్యత్ ఎన్నికల వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఫలితాలు వచ్చిన 24 గంటల్లోనే కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయంపై డీఎంకే మండిపడుతోంది. కాంగ్రెస్ పార్టీ తమను వెన్నుపోటు పొడిచిందని (backstabbers) డీఎంకే ప్రతినిధి శరవణన్ అన్నాదురై విమర్శించారు.మతతత్వ శక్తులను కూటమిలోకి చేర్చుకోకూడదనే నిబంధనతో కాంగ్రెస్ ఈ మద్దతునిస్తోంది.కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రెండు క్యాబినెట్ బెర్త్‌లతో పాటు కీలక బోర్డుల చైర్మన్ పదవులను ఆశిస్తోంది.
టీవీకే 108 స్థానాలను గెలుచుకోగా, మెజారిటీ మార్కు (118)కు 10 సీట్ల దూరంలో నిలిచింది. కాంగ్రెస్‌తో పాటు సీపీఐ(ఎం), వీసీకే వంటి పార్టీల మద్దతు కోసం విజయ్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ మేరకు విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేశారు
Breaking News

Subscribe our Newsletter