ఏలూరు నగరంలో డివిజన్ల పునర్ వ్యవస్తీకరణ పూర్తి స్థాయిలో చేయాలి. సిపిఐ..!

ఏలూరు నగరంలో డివిజన్ల పునర్ వ్యవస్తీకరణ పూర్తి స్థాయిలో చేయాలి. సిపిఐ..!

26/May/2026 07:06    Share:   

ఏలూరు నగరంలో డివిజన్ల పునర్ వ్యవస్తీకరణ పూర్తి స్థాయిలో చేయాలి.సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్.
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు.
భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఏలూరు ఏరియా ముఖ్య నాయకుల సమావేశం ఆర్.ఆర్.పేట, స్ఫూర్తి భవన్ నందు కురెళ్ళ వరప్రసాద్ అధ్యక్షతన జరిగినది.ఈ సమావేశంలో పాల్గొన్న సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ ఏలూరు నగరంలో 50 డివిజన్లు 62 డివిజన్లుగా మార్పు చేయుటకు ముసాయిదా సిద్ధం చేసిన మున్సిపల్ కార్పొరేషన్ వారు సక్రమమైన విధానంలో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.గతంలో డివిజన్ల పునర్ వ్యవస్తీకరణ సక్రమంగా చేయకుండా కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించడం వలన ప్రజలు,అభ్యర్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారని గుర్తు చేశారు.ప్రస్తుతం అటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు. ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శులు కురెళ్ల వరప్రసాద్,అడ్డగర్ల లక్ష్మీ ఇందిరా మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ల పునర్ వ్యవస్తీకరణ హడావిడిగా కాకుండా పూర్తి స్థాయిలో చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో ఏరియా సమితి కార్యవర్గ సభ్యులు కొల్లూరి సుధారాణి,మావూరి విజయ, గొర్లి స్వాతి, శాయన అభిలాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter