అనకాపల్లి మండలం, తగరంపూడి గ్రామంలో చోటుచేసుకున్న మాజీ మంత్రి దివంగత నేత శ్రీ గుడివాడ గురునాధరావు గారి విగ్రహం ధ్వంసం ఘటనపై అనకాపల్లి రూరల్ పోలీసులు వేగంగా స్పందించి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి
తగరంపూడి గ్రామంలోని చిన రామాలయం వీధి, స్కూల్ జంక్షన్ వద్ద 2019లో ఏర్పాటు చేసిన శ్రీ గుడివాడ గురునాధరావు గారి విగ్రహానికి సంబంధించి, ఈనెల 20వ తేదీ రాత్రి 09:00 గంటల నుండి 21వ తేదీ తెల్లవారుజామున 05:00 గంటల మధ్య కాలంలో గుర్తుతెలియని వ్యక్తులు విగ్రహం యొక్క రెండు చేతులను ధ్వంసం చేశారు
ఈ ఘటనపై తగరంపూడి గ్రామానికి చెందిన యాదగిరి రామచంద్ర రావు ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు, అనకాపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. Cr.No.54/2026 U/s 196(1), 324 (4) r/w 3 (5) కింద కేసు నమోదు చేసి ప్రాథమిక విచారణ చేపట్టారు
పోలీసుల దర్యాప్తులో లభించిన ఆధారాల ప్రకారం, ఈ విగ్రహ ధ్వంసానికి తగరంపూడి గ్రామానికి చెందిన ఈ క్రింది ముగ్గురు వ్యక్తులు కారకులుగా ప్రాథమికంగా నిర్ధారించడమైనది:మార్టూరు సోమశేఖర్,మైచర్ల మోహన్,ముమ్మిన చంద్రుడు
సదరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని, చట్టప్రకారం U/s. 35(3) BNSS కింద నోటీసులు జారీ చేశారు.
ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. తదుపరి విచారణలో ఎవరి ప్రమేయం ఉన్నట్లు తేలినా,వారు ఎంతటి వారైనా సరే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.