పీజీఆర్ఎస్ విజ్ఞప్తులను గడువులోగా పరిష్కరించాలి: జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ 

పీజీఆర్ఎస్ విజ్ఞప్తులను గడువులోగా పరిష్కరించాలి: జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ 

30/March/2026 21:39    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి 
ఏలూరు, మార్చ్, 30 : పీజిఆర్ ఎస్ ద్వారా అందిన విజ్ఞప్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు.    ఏలూరు జిల్లా కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో  జరిగింది.  ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ పీజిఆర్ ఎస్ ద్వారా అందిన విజ్ఞప్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలన్నారు. పీజిఆర్ ఎస్ ద్వారా అందిన విజ్ఞప్తులు రీఓపెన్ కాకుండా పరిష్కరించాలన్నారు.  
సోమవారం పీజిఆర్ ఎస్ లో 289 విజ్ఞప్తులు అందాయి.కార్యక్రమంలో ఇంచార్జ్ డిఆర్ఓ భాస్కర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు
Breaking News

Subscribe our Newsletter