దివ్యాంగులకు అండగా లాలం భాస్కర్ రావు చారిటబుల్ ట్రస్ట్: పింఛన్‌తో పాటు అదనపు ఆర్థిక సాయం!
01/May/2026 13:42
Share:
లాలం భాస్కర్ రావు చారిటబుల్ ట్రస్ట్ నుండి పింఛను పంపిణీ..!!తండ్రికి తగ్గ తనయుడు లాలం భరత్..!!!
క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ - యలమంచిలి :
ఎన్టీఆర్ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం పరిధిలోని వాడనర్సాపురం, చిన్న కలవలపల్లి, కోపుగుండుపాలెం, పెద్దకలవలపల్లి, గోవిందపాలెం గ్రామాల్లో మంచానికే పరిమితమైన దివ్యాంగులకు ఎన్టీఆర్ పింఛన్ రూ.6,000 పంపిణీ చేశారు.అదనంగా, లాలం భాస్కర్ రావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక్కొక్కరికి రూ.1,500 చొప్పున ఆర్థిక సహాయం అందించారు. దివ్యాంగులకు ప్రభుత్వం నుంచి రూ.15,000 పింఛన్ మంజూరు అయ్యే వరకు ప్రతి నెలా స్వంత నిధులతో రూ.1,500 చొప్పున అందిస్తామని లాలం భాస్కర్ రావు తనయుడు లాలం భరత్ తెలిపారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జ్ జల్లి ఆదిరెడ్డి, ఎంపిటీసీ కర్రి ప్రసాద్, యూనిట్ ఇన్‌చార్జ్ రాము, గ్రామ పార్టీ అధ్యక్షుడు రేఖా అప్పలరాజు, పి. బాబూరావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ స్వచ్చంద కార్యక్రమానికి లాలం భరత్ కు స్థానికులందరు కృతజ్ఞతలు తెలియజేసారు.