ఎలమంచిలి:
ఎలమంచిలి నియోజకవర్గ ప్రజల సమస్యల తక్షణ పరిష్కారమే ధ్యేయంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో 'జనవాని' కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు తమ సామాజిక మరియు వ్యక్తిగత సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు ప్రజల నుండి అర్జీలను స్వయంగా స్వీకరించి, వారి సమస్యలను ఓపికగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడికక్కడే సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు మరియు ఇతర పరిపాలనాపరమైన చిక్కులను వీలైనంత త్వరగా క్లియర్ చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.జనవాని కార్యక్రమం ద్వారా తమ సమస్యలు వేగంగా పరిష్కారం అవుతుండటంతో నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, కూటమి పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు