యలమంచిలి ఘనంగా ముఖ్యమంత్రి ఎన్ . చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
20/April/2026 21:36
Share:
యలమంచిలి నియోజకవర్గంలో అన్న క్యాంటీన్‌లో ఘనంగా ముఖ్యమంత్రి ఎన్ . చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు. క్రైమ్ అనాల్సిస్, టివియస్ ప్రకాష్, యలమంచిలి : యలమంచిలి నియోజకవర్గంలోని అన్న క్యాంటీన్‌లో ఎన్ . చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర , ఉత్తరాంధ్ర ఇన్‌చార్జ్ దామచర్ల సత్య , మాజీ ఎంపీ పప్పల చలపతి రావు , జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు , ఆర్డీసీ చైర్మన్ ప్రగడా నాగేశ్వర రావు , ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ , పరిశీలకుడు బొండా జగన్నాథం తదితరులు హాజరయ్యారు.అన్న క్యాంటీన్‌లో ప్రజల మధ్య కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్యాంటీన్‌కు విచ్చేసిన ప్రజలకు భోజనం వడ్డించారు.ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, అన్నదానం అన్నింటికంటే గొప్పదని మన సంస్కృతి చెబుతోందని పేర్కొన్నారు. పేదలకు మూడు పూటలా కడుపునిండా భోజనం అందించాలనే లక్ష్యంతో అన్న క్యాంటీన్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా ఒక రోజు అన్న క్యాంటీన్ల నిర్వహణకు రూ.76 లక్షలు విరాళంగా అందించడం ఆదర్శనీయమని అన్నారు.అలాగే నారా భువనేశ్వరి పేదల కోసం ఉచిత భోజనం అందించడం ఆమె దాతృత్వానికి నిదర్శనమని కొనియాడారు. గతంలో ఎన్ . టీ . రామరావు రూ.2కి కిలో బియ్యం పథకంతో సంక్షేమానికి శ్రీకారం చుట్టారని, అదే స్ఫూర్తితో అన్న క్యాంటీన్లు ప్రారంభించబడినట్లు గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.