గ్రామజ్యోతి యువత ఆధ్వర్యంలో పచ్చదనం, పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ..

గ్రామజ్యోతి యువత ఆధ్వర్యంలో పచ్చదనం, పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ..

19/April/2026 16:05    Share:   

యలమంచిలి మున్సిపాలిటీ, 23వ వార్డు, కొక్కిరాపల్లి

“ఆరోగ్యమే మహాభాగ్యం” – పచ్చదనం–పరిశుభ్రత కోసం గ్రామజ్యోతి యువత శ్రమదానం, 

అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ 23వ వార్డు కొక్కిరాపల్లి గ్రామంలో గ్రామజ్యోతి యువత ప్రతి ఆదివారం ఉదయం రెండు గంటలపాటు వార్డు పచ్చదనం, పరిశుభ్రత కొరకు శ్రమదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా, వార్డు ప్రజలకు పచ్చదనం, పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు గ్రామజ్యోతి యువత, పారిశుధ్య మేస్త్రీ, కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీలో ఆరోగ్యమే – మహాభాగ్యం నినాదాలు చేస్తూ, రోడ్లపై చెత్తను తొలగిస్తూ, ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. “ఆరోగ్యమే – మహాభాగ్యం” అనే నినాదంతో వార్డు ప్రజలందరూ పరిశుభ్రతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామజ్యోతి యువత, పారిశుధ్య మేస్త్రీ, కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొని, పరిశుభ్రతే సుస్థిర జీవనానికి మూలమని నిరూపించారు.

గ్రామజ్యోతి యువత, కొక్కిరాపల్లి

Breaking News

Subscribe our Newsletter