అనకాపల్లిలో కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ అనకాపల్లి జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లిలో మాజీ మంత్రివర్యులు, అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, జనసైనికులు, యువత, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా తరలివచ్చారు. బైక్ ర్యాలీ సందర్భంగా జనసేన పార్టీ జెండాలు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలతో అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన జనసేన నాయకులు, జనసైనికులు, యువత, వీర మహిళలు, అభిమానులకు జనసేన పార్టీ కార్యాలయం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమం కేవలం జన్మదిన వేడుక మాత్రమే కాదని, జనసేన పార్టీ బలం, నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని చాటిచెప్పే జనవిజయంగా నిలిచిందని పేర్కొన్నారు. కొణిదెల పవన్ కళ్యాణ్, కొణతాల రామకృష్ణ నాయకత్వంలో అనకాపల్లి గడ్డపై జనసేన పార్టీ మరింత బలపడాలని ఆకాంక్షించారు.
క్రైమ్ ఎనాలసిస్ జిల్లా ఇంచార్జ్ శ్రీనివాస్ అప్పికొండ