ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణకు వినతిపత్రం –
అనకాపల్లి:
ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు సంక్షేమ పథకాలు, ఉద్యోగ భద్రత, పని భారం తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆశా కార్యకర్తలు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కార్యాలయం వద్ద వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రజాప్రతినిధులకు తమ సమస్యలను వివరించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
అనంతరం ఎమ్మెల్యే కార్యాలయం నుంచి బెల్లం మార్కెట్ వరకు ఆశా కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించి సభ చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగినా ఆశా కార్యకర్తల వేతనాలు పెంచలేదని అన్నారు. ఉద్యోగ భద్రత లేకుండా తీవ్ర పని ఒత్తిడితో విధులు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.ప్రజాప్రతినిధులు తమ సమస్యలపై అసెంబ్లీలో చర్చించి వేతనాల పెంపుతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి గనిశెట్టి సత్యనారాయణ, అనకాపల్లి మండల కన్వీనర్ కాళ్ల త్యేలయ్యబాబు, సూర్యకళ, లక్ష్మి, రమణమ్మ, బంగారమ్మ తదితరులు పాల్గొన్నారు.
క్రైమ్ ఎనాలసిస్ అనకాపల్లి జిల్లా ఇంచార్జ్ శ్రీనివాసరావు అప్పికొండ