ఉద్యమ కెరటం ఎస్.ఎస్. ప్రసాద్ మృతి: సీపీఐ నేతల తీవ్ర సంతాపం

ఉద్యమ కెరటం ఎస్.ఎస్. ప్రసాద్ మృతి: సీపీఐ నేతల తీవ్ర సంతాపం

05/April/2026 06:18    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు:
# అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం(AIBEA) నేత కామ్రేడ్ యస్.యస్ ప్రసాద్(68) ఈ రోజు అర్ధ రాత్రి 1.30 నిమిషాలకు తాడేపల్లిగూడెంలో గుండె పోటుతో హఠాన్మరణం చెందారని ఒక ప్రకటనలో తెలియచేసి విచారాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రసాద్ కు భార్య,ఇద్దరు కుమారులు వున్నారని,యస్.యస్ ప్రసాద్ స్వగ్రామం తాడేపల్లిగూడెంలో విద్యార్ధి దశ నుంచి ఉద్యమాల పట్ల ఆకర్షితుడై ఎఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ,కార్మిక నాయకులు కపర్ధి గారి నాయకత్వ స్ఫూర్తితో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలలో చురుకుగా పాల్గొనే వారని కొనియాడారు.బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం,వారి హక్కుల సాధనకు పోరాడుతూ AIBEA లో అనేక నాయకత్వ బాధ్యతలు సమర్ధవంతంగా  నిర్వహించారని తెలిపారు.రిటైర్ అయిన తర్వాత కూడా తాడేపల్లిగూడెం కేంద్రంగా బ్యాంకు యూనియన్ ఉద్యమాలు,పోరాటాల్లో క్రియాశీలకంగా పనిచేస్తూ,సీపీఐ,ఏఐటీయూసీ ఇంకా పలు ప్రజా సంఘాల ఉద్యమాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తూ,కమ్యూనిస్టు ఉద్యమం బలోపేతం కావాలని నిత్యం తపనపడేవారని తెలిపారు.యస్.యస్ ప్రసాద్ మృతి బ్యాంకు ఉద్యోగులకు,ఏఐటీయూసీ,కమ్యూనిస్టు పార్టీ, ప్రజా సంఘాల ఉద్యమాలకు తీరనిలోటనీ వారి మృతికి సంతాపాన్ని,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఉప్పులూరి హేమ శంకర్.
సిపిఐ ఏలూరు జిల్లా సమితి సభ్యులు కురెళ్ళ వరప్రసాద్  వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.
Breaking News

Subscribe our Newsletter