యలమంచిలి  ఆర్టీసి కాంప్లెక్స్ ను తనిఖీ చేసిన నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్

యలమంచిలి ఆర్టీసి కాంప్లెక్స్ ను తనిఖీ చేసిన నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్

11/March/2026 14:17    Share:   

అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ కేంద్రమైన యలమంచిలి పట్టణ ఆర్టీసి కాంప్లెక్స్ ను తనిఖీ చేసిన నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు...
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పరవాడ నుంచి నక్కపల్లి వరకూ ఒక జోన్ గా ఉన్న నేపథ్యంలో ఎస్.రాయవరం, రాంబిల్లి తదితర ప్రాంతాల ప్రజలకు ప్రయాణార్ధం యలమంచిలి ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రధానమైనది కనుక భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కాంప్లెక్స్ కు అత్యాధునికంగా అభివృద్ధి చేయాల్సిన అవసరముందన్నారు. అలాగే ఇప్పటికే సుదూర ప్రాంతాలకు వెళ్లే సర్వీస్ బస్సులు యలమంచిలి కాంప్లెక్స్ లోకి వస్తున్నందున,వొల్వో బస్సులు కూడా వచ్చే విధంగా కాంప్లెక్స్ ని తీర్చిదిద్దుతామన్నారు.అలాగేకాంప్లెక్స్ లో నిర్వహిస్తున్న దుకాణాలలో తిను బండారాలను పరిశీలించారు. అదే విధంగా మరుగుదొడ్లను కూడా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసి అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.....
Breaking News

Subscribe our Newsletter