విద్యుత్ చార్జీల పెంపుదలను వ్యతిరేకిస్తూ 2000 సంవత్సరం ఆగస్టు 28 న చలో హైదరాబాద్ లో జరిగిన ప్రజా నిరసనలపై అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా లాఠీచార్జి, కాల్పులు జరిపి ముగ్గురు యువకిశోరాలు బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి పొట్టన పెట్టుకుంది. బుల్లెట్లు తగిలి వందలాదిమంది కాళ్లు, చేతులు ,తలకు తీవ్ర గాయాలు పాలయ్యారని నేటికి ఆ విషాద ఘటన జరిగి 26 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిపిఎం అచ్చుతాపురం మండల కమిటీ ఆధ్వర్యంలో వారికి నివాళులు నివాళి అర్పించడం జరిగింది .ఈ సందర్భంగా సిపిఎం అచ్చుతాపురం కన్వీనర్ ఆర్ .రాము మాట్లాడుతూ
విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ చలో హైదరాబాద్ పిలుపునిచ్చాయని. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలపై విచక్షణారహితంగా లాఠీచార్జి చేసి బాష్ప వాయువులు ప్రయోగించి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు అమరులయ్యారు, పలువురు గాయపడ్డారని
ప్రజల గొంతు నొక్కడానికి చంద్రబాబు ప్రభుత్వం చేసిన కుట్ర బషీర్బాగ్ కాల్పులు. విద్యుత్ చార్జీలు తగ్గించాలని అడిగినందుకు యువకులను కాల్చి చంపారని. ఈ26 సంవత్సరాలుకాలంలో విద్యుత్ చార్జీలు పెంచడానికి ప్రభుత్వాలు భయపడుతూనే దొడ్డిదారిన కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు ముసాయిదా బిల్లు 2020 తీసుకొచ్చి స్మార్ట్ మీటర్లు పెట్టి రోజు ,పూటకి ఒక రేటు చొప్పున విద్యుత్ చార్జీలు పెంచుతున్నది రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తును ఎత్తివేస్తున్నది దీంతో విద్యుత్ చార్జీలు, నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బషీర్బాగ్ అమరవీరుల త్యాగాన్ని స్మరించుకుంటూ విద్యుత్తు చార్జీలు పెంపును, స్మార్ట్ మీటర్లను ప్రజలంతా వ్యతిరేకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచదారల వెంకట్రావు, ధూళి శివ ,సన్యాసిరావు పుట్టా కార్మికులు పాల్గొన్నారు.