అచ్యుతాపురం కొండకర్ల గుంతల రోడ్డు తో ప్రయాణికుల అవస్థలు !
19/February/2026 14:23
Share:
అచ్యుతాపురం నుండి కొండకర్ల జంక్షన్ వరకు ఉన్న రోడ్డు గుంతలు లేకుండా బాగు చేయాలి, సిపిఎం
రోడ్డు విస్తరణలో భాగంగా అచ్యుతాపురం జంక్షన్ నుండి కొండకర్ల వరకు ఉన్న గుంతల లను పూడ్చి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని సిపిఎం అచ్చుతాపురం కన్వీనర్ ఆర్ రాము డిమాండ్ .ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రోడ్డులో ప్రయాణించే గర్భిణీలు, వృద్ధులు, ఎస్ ఈ జడ్ కార్మికులు, ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు కొత్త రోడ్డు పేరుతో పక్కనే ఉన్న ఈ రోడ్డు గతుకుల మయంగా మారి రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోడ్డు కాంట్రాక్టర్ ఇష్టానుసారం వ్యవహరించడం వలన దుమ్ము, ధూళి తో పాటు ఎప్పుడు ఎటువైపు వెళ్ళాలో తెలియక రాత్రులు వెలుతురు లేక అనేక ప్రమాదాలు కు గురవుతున్నారు రోడ్డుపైన దుమ్ము ధూళి రాకుండా నీళ్లు చల్లడం గానీ గోతులు లేకుండా చేయడం వంటి పనులు రోడ్డు కాంట్రాక్టర్ వదిలేశారు వీటిపై ఆర్ అండ్ బి అధికారులు వెంటనే కలుగజేసుకొని ఈ ప్రాంతంలో రాకపోకలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ అచ్చుతాపురం మండల కమిటీ డిమాండ్ చేస్తున్నది.