శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత ఒక మైలురాయి..

శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత ఒక మైలురాయి..

03/April/2026 07:29    Share:   

అమరావతి రైతుల కన్నీటి పోరాటానికి చారిత్రాత్మక విజయం..నెరవేరిన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష..అమరావతికి చట్టబధ్ధత 
మీడియా సమావేశంలో రెడ్డి అప్పల నాయుడు.. 
కొండల ప్రసాద్ CA న్యూస్ ఏలూరు ఇంచార్జి 
ఏలూరు, ఏప్రిల్ 02:- ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ, లోకసభలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సవరణ బిల్లు 2026 ఆమోదం పొందడంతో పై ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు హర్షం వ్యక్తం చేస్తూ గురువారం జనసేన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ లోక్సభలో సుదీర్ఘ చర్చ అనంతరం ఈ బిల్లు ఆమోదం పొందడం, రాష్ట్ర భవిష్యత్తుకు శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ చట్ట సవరణతో అమరావతికి ఏకైక రాజధానిగా పటిష్టమైన, చట్టబద్ధమైన భద్రత లభించిందని, ఇకపై అమరావతి శాశ్వత రాజధాని గానే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా నెలకొన్న అనిశ్చితికి సందిగ్ధతకు ఈ చారిత్రాత్మక పరిణామంతో శాశ్వతంగా తెరపడిందని రెడ్డి అప్పలనాయుడు వివరించారు. అమరావతి కోసం భూములిచ్చిన వేలాది మంది రైతుల త్యాగానికి, ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవంగా దీన్ని ఆయన అభివర్ణించారు. ధర్మం కోసం పోరాడిన అమరావతి ఉద్యమకారుల సంకల్పం నేడు చట్టరూపం దాల్చడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అలాగే లోక్సభలో బిల్లుకు ఆమోదం పలికిన అన్ని రాజకీయ పార్టీలకు ఏలూరు నియోజకవర్గ ప్రజల తరఫున, కూటమి పార్టీ నాయకులు అందరీ తరఫున, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు.అమరావతి చట్టబద్ధత బిల్దుకు వైసిపి తప్ప, అన్ని రాజకీయ పార్టీల మద్దతు లభించడం ప్రజాభిప్రాయానికి ప్రతిబింబమని ఆయన వ్యాఖ్యానించారు. ఇకపై రాజధానిని ఎవరు కదల్చలేరని ఇది అమరావతి ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి అభివృద్ధి పనులు వేగంగా పున ప్రారంభమయ్యాయని ఆయన వెల్లడించారు. రోడ్లు, ప్రభుత్వ భవనాలు, మౌలిక వసతుల నిర్మాణం వేగంగా కొనసాగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం భారీ నిధులు కేటాయించడంతో అమరావతి త్వరలోనే దేశానికి ఆదర్శ రాజధానిగా అవతరిస్తుందని రెడ్డి అప్పలనాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. అమరావతి పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందితే, భారీ పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఇది రాష్ట్ర యువత భవిష్యత్తుకు గోల్డెన్ గేట్ వేగా నిలుస్తుందని అన్నారు. మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, 44 వ డివిజన్ కార్పోరేటర్ పొలిమేర దాసు, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షులు వీరంకి పండు, నాయకులు రెడ్డి గౌరీ శంకర్, సరిది రాజేష్, బోండా రాము నాయుడు, ఎట్రించి ధర్మేంద్ర, గొడవర్తి నవీన్, జనసేన రవి, వాసా సాయి, కర్ర టవిటి రాజు, వేముల బాలు, బొందిలి సాయి రామ్ సింగ్, వీర మహిళలు తుమ్మపాల ఉమా దుర్గా, యడ్లపల్లి మమతా తదితరులు పాల్గొన్నారు..
Breaking News

Subscribe our Newsletter