ఆధునిక ప్యాకేజింగ్ విధానాలతో మార్కెట్ విస్తరణ   ఏలూరులో ఐఐపి వారిచే  గ్రీన్ ప్యాకేజింగ్ టెక్నాలజీస్ పై శిక్షణ 

ఆధునిక ప్యాకేజింగ్ విధానాలతో మార్కెట్ విస్తరణ  ఏలూరులో ఐఐపి వారిచే  గ్రీన్ ప్యాకేజింగ్ టెక్నాలజీస్ పై శిక్షణ 

14/May/2026 21:18    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు, 

జిల్లాలోని డిఆర్డిఏ , వ్యవసాయ శాఖ, ఉద్యానవనాలు, పరిశ్రమల శాఖకు సంబందించిన ఉత్పత్తిదారులకు 
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (IIP) సహకారంతో బుధవారం  ఏలూరు జిల్లా DRDA TTDC శిక్షణ కేంద్రంలో "గ్రీన్ ప్యాకేజింగ్ టెక్నాలజీస్ పై ఒక రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఆధునిక ప్యాకేజింగ్ విధానాలతో మార్కెట్ విస్తరణపై, "గ్రీన్ ప్యాకేజింగ్ టెక్నాలజీస్: ఆహార మరియు ఆహారేతర రంగాల్లో సవాళ్లు - భవిష్యత్తు దిశానిర్దేశం" అనే అంశంపై లోతైన అవగాహన కల్పించారు. 
 ప్రధాన శిక్షకులు డా. మదన్ ఎం. మణిపాటి   పర్యావరణ హితమైన (Green Packaging) ప్యాకేజింగ్ పద్ధతుల ప్రాముఖ్యతను పారిశ్రామికవేత్తలకు వివరించారు.
DRDA ప్రాజెక్ట్ డైరెక్టర్  T.V. విజయలక్ష్మి  మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో ఉత్పత్తుల నాణ్యతతో పాటు ఆకర్షణీయమైన, ఆధునిక ప్యాకేజింగ్ ఉంటేనే మార్కెట్‌లో రాణించగలమన్నారు.   ప్లాస్టిక్ రహిత మరియు పర్యావరణానికి మేలు చేసే గ్రీన్ ప్యాకేజింగ్ పద్ధతులను అనుసరించడం ద్వారా వ్యాపార అభివృద్ధికి కొత్త మార్గాలు సుగమం అవుతాయన్నారు.
కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ వెంకటరావు, , మెప్మా పీడీ రాజబాబు, , ఫిషరీస్ డీడీ రాజకుమార్ , జిల్లా హార్టికల్చర్ మరియు వ్యవసాయ శాఖ అధికారులు,  DRDA   మరియు ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter