జులై 11వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ కేసులు పరిష్కారానికి న్యాయవాదులు కృషిచెయ్యాలి..!
22/May/2026 19:37
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు,
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి శ్రీమతి యన్.శ్రీదేవి, శుక్రవారం జిల్లా న్యాయసేవా అధికారసంస్థ భవనము నందు ఏలూరు ప్యానల్ న్యాయవాదులతో సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి శ్రీమతి యన్.శ్రీదేవి మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా నియమించిన న్యాయవాదులు యొక్క కేసులు పురోగతి మరియు కేసులు సత్వర విచారణకు తీసుకోవాల్సిన చర్యలుపై చర్చించడం జరిగిందని అన్నారు. అలాగే కేసులు యొక్క పురోగతిని అడిగి తెలుసుకోవడం జరిగిందని తెలియజేశారు. ఈ కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి కృషిచెయ్యాలని, అలసత్వం తగదని ప్యానల్ న్యాయవాదులకు సూచించారు.జులై 11వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ నందు కేసులు పరిష్కారానికి న్యాయవాదులు కృషిచెయ్యాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్యానల్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.