ఘన స్వాగతం పలికిన ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు గారు.. కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు. ఏలూరు జిల్లా సమీక్షా కమిటీ సమావేశం కార్యక్రమాల నిమిత్తం శుక్రవారం ఏలూరుకు విచ్చేసిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మాత్యులు, ఏలూరు జిల్లా ఇంచార్జీ మంత్రి వర్యులు, గౌరవనీయులు పెద్దలు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ఏలూరులోని రెవెన్యూ గెస్ట్ హౌస్ వద్ద ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు గారు ఘన స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు (చినబాబు) గారు, ఉంగుటూరు ఎమ్మెల్యే శ్రీ పట్సమట్ల ధర్మరాజు గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు నారా శేషు గారు, కార్పోరేటర్లు పొలిమేర దాసు, కోయ సత్తిబాబు మరియు పలువురు ఉన్నతాధికారులు, కూటమి పార్టీల నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు..