ఏఐటియుసి రాష్ట్ర 18వ మహాసభలను జయప్రదం చేయండి.

ఏఐటియుసి రాష్ట్ర 18వ మహాసభలను జయప్రదం చేయండి.

22/April/2026 07:11    Share:   

ఏఐటీయూసీ 
యలమంచిలి/కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలపై    ఉద్యమిస్తామని ఏఐటియుసి రాష్ట్ర సమితి సభ్యులు గని శెట్టి.  ఏసుదాస్ అన్నారు. మంగళవారం స్థానిక రైల్వే స్టేషన్ రోడ్ లోని రైస్ మిల్లు వద్ద ఉమ్మడి విశాఖపట్నం రైస్ మిల్ అండ్ ముఠా కార్మిక సంఘం  సమావేశ అనంతరం ఈనెల 26 నుండి 28 వరకు తిరుపతిలో జరిగే 18వ రాష్ట్ర మహాసభల పోస్టర్ను కార్మికులతో కలిసి విడుదల చేశారు.ఈ సందర్భంగా ఏసుదాసు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై, నాలుగు లేబర్ కోడులు కు వ్యతిరేకంగా సాగించాల్సిన పోరాటాలపై, 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై సాగించాల్సిన పోరాటాలకు, మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహాసభల్లో రూపకల్పన  జరుగుతుందని, నూతన నాయకత్వాన్ని ఎన్నిక జరుగుతుందని, కావున ఈ మహాసభలకు జిల్లాలోని ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘాల  సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని, జయప్రదం చేయాలని ఏసుదాస్ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా రైస్ మిల్ అండ్ ముఠా కార్మిక సంఘ నాయకులు వీసం. వెంకటరమణ యన్. రమణ గొల్లవిల్లి. శ్రీను, తాతారావు, శ్రీను, తదితరులు పాల్గొన్నారు
Breaking News

Subscribe our Newsletter