భవన నిర్మాణ రంగ కార్మికులకు సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు

భవన నిర్మాణ రంగ కార్మికులకు సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు

23/April/2026 07:38    Share:   

భవన నిర్మాణ రంగ కార్మికులకు సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు, 28వ డివిజన్లో కలెక్టర్ ఆదేశాలతో ప్రత్యేక కార్యక్రమం,పథకం కింద లబ్ధి పొందే సందర్భాలు: వివాహం, ప్రసవం, మరణం వివాహ కానుక, ప్రసవ సాయం: రూ.20,000 చొప్పున,సహజ మరణంపై రూ.60,000 + అంత్యక్రియలకు రూ.20,000 అర్హత: 18 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల కార్మికులు
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు
ఏలూరు 28వ డివిజన్లో భవన నిర్మాణ రంగ కార్మికులకు పలు సంక్షేమ పథకాలు అమలుపరుస్తున్నట్లు ఏలూరు జిల్లా కలెక్టర్ గారైన గౌరవ వెట్రి సెల్వి గారు తెలియజేయడం జరిగింది. ఈ పథకం పథకం గురించి డివిజన్లో ప్రజలకు తెలియజేయాలని డివిజన్ కార్పొరేటర్ గారైన తంగిరాల అరుణ సురేష్ గారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జి.నాగేశ్వరరావు గారు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్. జై.గోపాలకృష్ణ గారు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్-2  ఏలూరు జి.వెంకటరమణ గారు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్-1  ఏలూరు పాల్గొనడం జరిగింది. ఈ పథకం గురించి అసిస్టెంట్ కమిషనర్ గారు డివిజన్ ప్రజలకు వివరంగా తెలియచేయడం జరిగింది. ఈ పథకంలో ఆన్లైన్ చేయించుకున్న కార్మికుడికి మరియు కార్మికురాలికి వారి ఇంట్లో వివాహం జరిగితే వివాహం కానుక కింద 20000/- వేల రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వడం జరుగుతుంది. మరియు కార్మికుడి ఇంట్లో వారి కూతురు గాని మరియు భార్య కానీ ప్రసవించడం (డెలివరీ) జరిగితే 20000/-వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. మరియు కార్మికుడు సహజంగా మరణం గా చనిపోతే 60,000/- వేల రూపాయలు ఇవ్వడం మరియు అంత్యక్రియలకు 20000/- వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. అని జి.నాగేశ్వరరావు గారు ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ భవన నిర్మాణ రంగ పథకంలో 18.సంవత్సరాల నుండి 60.సంవత్సరాలు లోపు ఉన్న ఆడవారు కాని మొగవారు కానీ కార్మికులు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు దీనికి మీరు ఖర్చు పెట్టేది సంవత్సరానికి 12/- రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాలకి 110/- రూపాయలు చెల్లిస్తే మీకు రాష్ట్ర ప్రభుత్వం మరియు (కార్మిక శాక) లేబరు డిపార్ట్మెంట్ మీకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం చేయడం జరుగుతుందానీ ప్రజలకు వివరించడం జరిగింది.

Breaking News

Subscribe our Newsletter