జూన్ 3, 4,5 తేదీలలో ఏలూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలు.
23/April/2026 21:24
Share:
25న అఖిల భారత రైతు సంఘం అధ్యక్షులు డాక్టర్ అశోక్ ధావలే జంగారెడ్డిగూడెం రాక..వ్యవసాయ సంక్షోభం - పరిష్కార మార్గాలు - మద్దతు ధరల గ్యారెంటీ చట్టం అంశంపై రైతు రాష్ట్ర సదస్సు.- ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి.. కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు: జూన్ 3, 4,5 తేదీలలో ఏలూరులో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల సందర్భంగా ఈనెల 25న మధ్యాహ్నం 3 గంటలకు జంగారెడ్డిగూడెం లోని సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్ లో వ్యవసాయ సంక్షోభం- పరిష్కార మార్గాలు - మద్దతు ధరలు గ్యారెంటీ చట్టం అంశంపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఉద్దరాజు రామం మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైతు రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ చెప్పారు. గురువారం ఏలూరులోని అన్నే భవనంలో వారు మీడియాతో మాట్లాడారు. 500 సంఘాలతో ఏర్పడిన సంయుక్త కిసాన్ మోర్చా నిర్వహించిన ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ అశోక్ ధావలే జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న రాష్ట్ర రైతు సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నారని చెప్పారు. వివిధ రైతు సంఘాల నాయకులను, ప్రముఖులను అన్ని పంటల రైతులను సదస్సుకు ఆహ్వానించినట్లు చెప్పారు. ఈ రైతు సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ప్రస్తుత వ్యవసాయం సంక్షోభంలో ఉందని, రైతులు నష్టాల్లో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మద్దతు ధరలు గ్యారెంటీ చట్టం కోసం పెద్ద ఎత్తున రైతు సంఘాలు పోరాడుతున్నాయని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న రైతు సదస్సులో అందరూ పాల్గొనవలసిందిగా కోరారు.