రైతాంగ సమస్యలు పరిష్కరించాలి... రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్ .
02/June/2026 09:52
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు. రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకొని రైతాంగ సమస్యలు పరిష్కరించాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి డేగా ప్రభాకర్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ నేటి నుంచి ప్రారంభమవుతుంటే... ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం సాగుతోపాటు విత్తన,రుణ ప్రణాళికలు ప్రకటించకుండా కాలయాపన చేస్తూ ఖరీఫ్ సీజన్ ను నిర్లక్ష్యం చేస్తోందన్నారు.సాగునీటి విడుదలపై తేదీలు నిర్ణయించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ప్రాజెక్టుల కింద ఉన్న కాలువలలో పూడిక తీయలేదని, తూటికాడ, గుర్రపు డెక్క పేరుకుపోయి ఉన్నట్లు చెప్పారు. కాలువల గేట్లు తుప్పు పట్టి ఉన్నాయని, వాటిని మార్చి కొత్తవి అమర్చే నాధుడే లేరన్నారు. మరమ్మతులకు నోచుకోక వందల సంఖ్యలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు మూలన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు,కౌలు రైతులకు అవసరమైన విత్తనాలను, పచ్చిరొట్ట విత్తనాలను 90 శాతం రాయితీతో అందించాలన్నారు.పెరుగుతున్న విత్తనాల ధరలు నియంత్రించాలని, నాసిరకం, కల్తీ విత్తనాలను అరికట్టేందుకు చర్యలుచేపట్టాలన్నారు.పెరిగిన సాగు ఖర్చులకు అనుగుణంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి పంట రుణాలు అందించి, ఎలాంటి పూచి కత్తు లేకుండా రూ.5 లక్షల వరకు అందించాలన్నారు. నాణ్యత సాకుతో పొగాకు ధరలు తగ్గించి రైతుల కష్టార్జితాన్ని కంపెనీలు కాజేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదించి నాణ్యత ఆధారంగా మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు.పంట రుణాలు రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని అన్నారు. ఎరిగిన రొయ్యల మేత ధరలు తగ్గించి, మద్దతు ధర ప్రకటించి, నాన్ జోన్ లతో సంబంధం లేకుండా ఆక్వా సాగుకు యూనిట్ విద్యుత్ కు రూ.1.50 చొప్పున రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు, మామిడి,కోకో తదితర పంటలకు గిట్టుబాటు ధర ప్రకటించి కొనుగోలు చేయాలన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తోతాపురి మామిడి టన్నుకు 18000 బంగినపల్లి రసాలు టన్నుకు 15000 మద్దతు ధర ఇవ్వాలని తెలంగాణలో పామాయిల్ రైతులకు తన్నుకు ఇచ్చే ధరను ఆంధ్రాలో ఇవ్వాలని రైతులు కవులు రైతులకు రెండు లక్షల వరకు తెలంగాణలో చేసినట్లు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.తక్షణం ప్రభుత్వం రైతాంగ సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో కలిసివచ్చే రైతు సంఘాలను కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాయంకుల లక్ష్మణరావు మాట్లాడుతూ పండించిన పంటలకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.చిన్న, సన్నకారు, కౌలు రైతులందరికీ 90 శాతం సబ్సిడీతో వ్యవసాయ యంత్ర పరికరాలు అందించాలని డిమాండ్ చేశారు.కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొంత కృష్ణ మాట్లాడుతూ కౌలు రైతులకు నేటి వరకు గుర్తింపు కార్డులు జారీ చేయకపోవడం సరైన విధానం కాదన్నారు. తక్షణం గ్రామసభలు నిర్వహించి కౌలు రైతులను గుర్తించాలని కోరారు. నిత్యం పెరుగుతున్న ఎరువుల ధరలు తగ్గించాలని, వ్యవసాయానికి అవసరమైన పెట్రోలు డీజీలు సబ్సిడీతో అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బండి వెంకటేశ్వర రావు, నిమ్మగడ్డ నరసింహ, సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్, రెడ్డి శ్రీనివాస్ డాంగే, మడుపల్లి నాగేంద్రరావు, పి కిషోర్, చంగల వెంకటేశ్వరరావు, అబ్బూరి రంగారావు, కర్ర రామకృష్ణ, కూచిపూడి నాగేశ్వరరావు, బొప్పూడి రాంబాబు. ఏ లక్ష్మీ,సిపిఐ ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి అడ్డగర్ల లక్ష్మీ ఇందిరా, కార్యవర్గ సభ్యులు శాయన అభిలాష్ కుమార్,బళ్ళ కనకదుర్గారావు,బుగ్గల ప్రభాకర్,కడుపు కన్నయ్య, ఉప్పులూరి లక్ష్మి భవాని,బి జగన్నాథం,సూర్య మణి,కే సత్య నారాయణ,కే నాయుడు,జి రమేష్, ఎల్.గోపి,జగదీశ్వరి, ఎ.రంగమ్మ,కే.సూర్యవతి,రామలక్ష్మి,ఎల్ సరస్వతి, కే.పార్వతి, డి.తులసి తదితరులు పాల్గొన్నారు.