మార్చి 16 నుంచి నిర్వహించనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి.
15/March/2026 07:45
Share:
# మార్చి 16 నుంచి నిర్వహించనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు వ్రాసేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కమాండు కంట్రోల్ రూమ్ 9491395377 నెంబరుకు సమస్యలు ఉంటే విద్యార్థులు ఫోను చెయ్యాలి. జిల్లా విద్యాశాఖ అధికారి యం.వెంకటలక్ష్మమ్మ ... ఏలూరు, మార్చి14: స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి ఛాంబల్లో శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి యం.వెంకటలక్ష్మమమ్మ అధ్యక్షతన జిల్లా పదవ తరగతి పరీక్షలు నిర్వహణ ఏర్పాట్లపై పాత్రికేయులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి యం.వెంకటలక్ష్మమ్మ మాట్లాడుతూ ఈనెల 16వ తేదీ నుండి ఏప్రిల్ 01వ తేదీ వరకు జరిగే పదవ తరగతి పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 24,019 విద్యార్థులకు 133 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షలు ఉదయం 9:30 నుండి 12.45 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. అపోస్ పరీక్షలకు 803 మంది విద్యార్థులకు 11 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఉదయం 9:30 గంటలు నుండి 12.30 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థి పరీక్షా సమయానికి ఒక గంట ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరాలని తెలిపారు. పరీక్షలు నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా పగడ్బందీగా నిర్వహించి, జిల్లాకు మంచి పేరు తెచ్చేలా పరీక్షలు నిర్వహణ అధికార్లుకు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించామని అన్నారు. ఎక్కడ మాస్ కాపీయింగు, పేపర్ పరీక్ష పత్రాలు లీకేజీ వంటివి జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. పదవ తరగతి పరీక్షలు ఫలితాలు రాష్ట్రంలో ప్రధమ స్థానంలో నిలిచేలా విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు నిర్వహించామని, సబ్జెక్టులలో వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. ఏలూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కమాండు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసామని, 9491395377 నెంబరుకు ఫోను చేసి విద్యార్థులకు ఏటువంటి ఇబ్బందులు కలిగినా తెలియ చెయ్యాలన్నారు. విద్యార్థులకు పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ప్రత్కేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చెయ్యడం జరిగిందని, హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని తెలిపారు. స్టోరేజీ పాయింట్స్ 31, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపర్డెంట్లు 133, డిపార్ట్మెంటు అధికారులు 133, అదనపు డిపార్ట్మెంటు అధికారులు 02, ఫ్లయింగు స్క్వాడ్లు 06, సి సెంటరు రూటు ఆఫీసర్లు 20 నియమించామని తెలిపారు. జిల్లాలో సమస్యాత్మక 8 పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో పరీక్షలు నిర్వహణ సహాయ కమీషనరు ఆర్.ఆశ, జిల్లా విద్యాశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.