యలమంచిలి: అంగనవాడి టీచర్లకు, కనీస వేతనం 26000, ఆయాలకు, 20000 పెంచాలని, పెండింగ్ ఉన్న 1810 మినీ వర్కర్లకు క్వాలిఫికేషన్ రిలాక్స్ చేసి మెయిన్ సెంటర్ గా మార్చాలని, చట్టబద్ధమైన గ్రాట్యూటీ అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలని హెల్పర్లకు ప్రమోషన్ ఇవ్వాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరుతూ చలో విజయవాడ జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు అన్నారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ కుండ్రపు సోమునాయుడు, అంగనవాడి మండల కార్యదర్శి కె.నారాయణమ్మ మాట్లాడుతూ నేటి కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీల సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు విస్మరించి అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయకపోగా యాప్లు భారంతో పని ఒత్తిడిని పెంచుతున్నాయని అన్నారు. 24 గంటలు యాప్స్ తోనే సరిపోతుంటే ఎప్పుడు పిల్లలకి చదువు చెప్పాలని ప్రశ్నించారు. ధరల విపరీతంగా పెరుగుతున్నప్పటికీ అంగన్వాడీల జీతాలు మాత్రం పెంచడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అచ్చుతాపురం వరలక్ష్మి, పద్మ, జయ, సత్యవతి, నారాయణమ్మ, అంబిక, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.