ఎండ తీవ్రత మరియు వడగాల్పులు, అనకాపల్లి జిల్లా," నాగవంశం సంక్షేమ సంఘం" ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం సామాజిక కార్యక్రమం చేపట్టారు.
ఉదయం 10 గంటల నుండి అనకాపల్లి పెరుగు బజారు జంక్షన్ వద్ద బాటసారుల దాహార్తిని తీర్చడానికి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, ఎండల తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కొద్దిగానైనా ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.2500కు పైగా చల్లని మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ.
- ప్రెసిడెంట్: బుగత వెంకట సాంబమూర్తి
- ట్రెజరర్: పోలుబోతు సోమలింగేశ్వర నాయుడు
- వైస్ ప్రెసిడెంట్లు: తాలాడ కిరణ్ చంద్రశేఖర్ నాయుడు,
బుగత కోటేశ్వరరావు, రాయిని బంగారు నాయుడు, యెన్నింటి సత్యం మాస్టర్, పట్నాల నరసింహమూర్తినాగవంశం సంక్షేమ సంఘం కమిటీ సభ్యులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని, స్వయంగా మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. తీవ్రమైన ఎండలో తమకు చల్లని మజ్జిగ అందించి ఆదుకున్నందుకు శ్రమ కార్మికులు, పాదచారులు కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.