ఏలూరులో ట్రాఫిక్ నియంత్రణకు ఆశ్రం హాస్పిటల్ మద్దతు: 20 బారికేడ్లు అందజేసిన కాలేజీ యాజమాన్యం

ఏలూరులో ట్రాఫిక్ నియంత్రణకు ఆశ్రం హాస్పిటల్ మద్దతు: 20 బారికేడ్లు అందజేసిన కాలేజీ యాజమాన్యం

13/June/2026 21:27    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు 
ఏలూరులో రహదారి భద్రతను పెంపొందించే లక్ష్యంతో, ఆశ్రం హాస్పిటల్ యాజమాన్యం స్వచ్ఛందంగా 20 ట్రాఫిక్ బారికేడ్లను పోలీస్ శాఖకు ఆశ్రం హాస్పిటల్ ప్రతినిధులు అందజేశారు.నగరంలో ప్రమాదకరమైన ప్రాంతాలు మరియు జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను అరికట్టడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.ఈ కార్యక్రమంలో ఆశ్రం హాస్పిటల్‌కు చెందిన  Dr. K. హనుమంతరావు CEO, ఆశ్రం హాస్పిటల్.Dr. Ch. శ్రీనివాస్ ప్రిన్సిపల్, ఆశ్రం మెడికల్ కాలేజీ.Dr. ప్రణయ కృష్ణ I/c ఎమర్జెన్సీ డాక్టర్, ఆశ్రం హాస్పిటల్.బాల రాజశేఖర్ (కెన్న) జనరల్ మేనేజర్,ప్రమాద సమయాల్లో బాధితులకు తక్షణ వైద్యం అందించడమే కాకుండా, ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యల్లో కూడా భాగస్వాములు కావడం అభినందనీయమని డీఎస్పీ ఏలూరు డీఎస్పీ శ్రీ డి. శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు.ఈ బారికేడ్లను నగరంలోని ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరియు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న చోట ఏర్పాటు చేయడం వల్ల వాహనదారులు నిబంధనలు పాటించే అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు.మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్ యాజమాన్యం ఇలా పోలీసు శాఖతో కలిసి పనిచేయడం వల్ల ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన పెరుగుతుందని ఆశ్రం ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.ఇటువంటి ప్రజాహిత కార్యక్రమాలు పోలీస్ వ్యవస్థకు మరియు ప్రజలకు మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలపరుస్తాయని డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ కొనియాడారు.ప్రమాదాల నివారణలో పోలీసులకు తోడ్పడిన ఆశ్రం సంస్థ యాజమాన్యానికి  పోలీస్ యంత్రాంగం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది.ఈ రకమైన సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర ప్రైవేట్ సంస్థలకు మరియు వ్యాపార సంస్థలకు ఆదర్శంగా నిలుస్తాయని అధికారులు ఆకాంక్షించారు.
Breaking News

Subscribe our Newsletter