యలమంచిలి/ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 125 రోజులు పని దినాలు కడపనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఎంపీపీ రాజాన శేషు అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ రాజాన శేషు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 27వ తేదీ నుండి మార్చి 30 వరకూ వికసిత భారత్ గ్రామ సంవాద్ పేరు తో వికసిత భారత్ గారంటీ రోజ్గార్ అజీవకా మిషన్ గ్రామీణ్ (విబి జి రామ్ జీ) చట్టంపై 6 వారాలు పాటు ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాయని అన్నారు. 125 రోజుల పని కి చట్టబద్ధమైన హామీ, నిరుద్యోగ భృతి, ఆలస్య చెల్లింపు నిబంధనలు గ్రామ స్థాయిలో సకాలంలో పని, పారదర్శకత తో కూడిన చెల్లింపు అని ప్రతిజ్ఞ చేయించడం జరుగుతుందని తెలిపారు. గ్రామ ప్రజా ప్రతినిధులు, పెద్దలు, గ్రామస్థులు చేత గ్రామానికి అవసరమైన పనులుపై చర్చించడం గ్రామస్థులు పిల్లలు చేత మహాత్మాగాంధీ, వికసిత భారత్ గ్రామాలు అంశంపై చిత్రలేఖనం, ఉచ్చారణ పోటీలు ఉపాధి శ్రామికులు తో ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 100 రోజులు పూర్తి చేసిన ఉపాధి శ్రామికులుకి మండలస్థాయిలో సన్మానం చేయుట, మొదలైన కార్యక్రమాలు అన్ని ఈ 6 వారాలలో పూర్తి చేసి ఏప్రిల్ నుండి వికసిత భారత్ గారంటీ రోజ్గార్ అజీవకా మిషన్ గ్రామీణ్ పనులు మొదలు పెట్టడానికి సమాయత్తం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో శ్రీనివాస్, మండల ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది, విబి జి రామ్ జీ సిబ్బంది పాల్గొన్నారు.