అర్హులందరికీ సంక్షేమ ఫలాలు, కూటమి ప్రభుత్వ ధ్యేయం: ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి..
18/June/2026 20:33
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందించడంతో పాటూ ఎవరి కాళ్ళపై వారు నిలబడేలా పూర్తిస్థాయిలో అభివృద్ధిని చేసి చూపించేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు తపిస్తోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి 50లక్షల కుటుంబాల వారు పలు సంక్షేమ పథకాల ద్వారా వివిధ రూపాల్లో మేళ్ళను పొందారని ఆయన వెల్లడించారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టిడిపి జిల్లా అధ్యక్షులు బడేటి చంటి మాట్లాడారు. ప్రధానంగా అన్నదాతా సుఖీభవ జిల్లాస్థాయి విజయోత్సవ సభను విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలకు ఆయన శుభాభినందనలు తెలిపారు. ఇదేలక్ష్యాన్ని మరింత విస్త్రృతం చేసేందుకు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 45రోజుల పాటూ ఇంటింటికీ వెళ్ళనున్నట్లు ఆయన వెల్లడించారు. కూటమి విజయ గాథలను లబ్దిదారులతోనే పలికించేలా కార్యక్రమాన్ని రూపొందించినట్లు పేర్కొన్న ఎమ్మెల్యే బడేటి చంటి,,, తమది మాటల ప్రభుత్వం కాదనే సత్యాన్ని ప్రజలే చెప్పుకునే స్థాయిలో పాలన కొనసాగుతోందంటూ వ్యాఖ్యానించారు. ఇంటింటికీ కార్యక్రమం జరిగే 45రోజుల పాటూ కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను సవివరంగా ప్రజలందరికీ వివరించాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, నాయకులు లంకపల్లి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు...