దళితుల పట్ల కక్ష సాధింపు ఆపాలని విదసo డిమాండ్.. పంచదార్ల అసైన్డ్ భూముల ను వెనక్కి తీసుకుంటూ తహసీల్దార్ ఇచ్చిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని విదసం (విస్తృత దళిత సంఘాల) ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట రావు డిమాండ్ చేశారు..పంచదార్ల అసైన్డ్ భూముల లో కొనసాగుతున్న నిరసన శిబిరాన్ని విదసo నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా వెంకట రావు మాట్లాడుతూ అసైన్డ్ రైతులు అందరూ భూముల్లో వ్యవసాయ చేస్తున్నప్పటికీ అధికారులు తప్పుడు నివేదికలు తయారు చేసి దళితుల భూములు కాజేయడానికి కుట్ర పన్నారని పేద దళితుల జీవనాధారం లాక్కుని పొట్టకొట్టడం అధికారులకు తగదని ఎంతటి త్యాగానికైనా సిద్ధపడి దళితుల భూములు కాపాడతామన్నారు ... ఈ కార్యక్రమంలో విదసం నాయకులు బూల భాస్కర రావు, రేవిడి కృష్ణ, గుడబండ అప్పారావు, రేబాక రాము, అబద్దం, బీర నూకరాజు,గూడబండి కనకారావు, గూటాల చిరంజీవి, అనంతరపు ఈశ్వరరావు, గూడబండి సాయమ్మ, తెరపల్లి నాగమణి, తదితరులు పాల్గొన్నారు..