ఏలూరులో నిష్పక్షపాతంగా ఓటర్ల జాబితా సవరణ: ఎమ్మెల్యే బడేటి చంటి
19/June/2026 20:19
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ - సర్ ప్రక్రియ ఏలూరు అసెంబ్లీ నియోజకర్గంలో నిష్పక్షపాతంగా కొనసాగుతోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఈ విషయంలో నియోజకవర్గంలోని ఓటర్లెవ్వరూ ఎటువంటి అపోహలకూ గురికానవసరం లేదంటూ ఆయన ప్రజల్లో విశ్వాసం నింపారు. ఇదేఅంశంపై ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడారు. ఇటీవలె కొన్ని మతాలకు చెందిన కొందరు వ్యక్తులు సర్ ప్రక్రియ ద్వారా తమకేదో అన్యాయం జరుగుతోందనే దుష్ప్రచారాన్ని విస్త్రృతం చేసి ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించాలని చూడడం సరికాదన్నారు. భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో సర్ ప్రక్రియ ఎంతో పారదర్శకంగా కొనసాగుతోందని, అర్హులైన వారి ఓటు భద్రతకు పరిపూర్ణమైన గ్యారంటీ ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఏమైనా సందేహాలుంటే తననే నేరుగా సంప్రదించవచ్చునని ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు. ఇప్పటికైనా కొన్ని మతాలకు చెందిన కొందరు వ్యక్తులు ఇటువంటి దుష్ప్రచారాలను మానుకోవాలంటూ ఆయన హితవు పలికారు. సమావేశంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు...