మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి కార్యక్రమం.!"

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి కార్యక్రమం.!"

21/May/2026 20:26    Share:   

క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ - ఉత్తరాంద్ర జోనల్ ఇంచార్జ్ :

మాజీ ప్రధాని భారతరత్నం రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి యలమంచిలి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగు మంత్రి సాయి ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమం ముఖ్యఅతిథిగా విచ్చేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తనకాల అనంతరావు, జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకులు నాగు మంత్రి శాంతి లు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనంతరావు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ముందుచూపుతో 18 సంవత్సరాలకే యువతకు ఓటు హక్కు తీసుకువచ్చి కంప్యూటర్లు వ్యవస్థను తీసుకువచ్చి ఈ దేశానికి దిశా దశ నిర్దేశం చేశారని అన్నారు. రాజీవ్ గాంధీ ఈ దేశ ఐక్యత కోసం, సామరస్యత కోసం పాటుపడి తన తన ప్రాణాలు అర్పించారని తెలిపారు. రాజీవ్ గాంధీ చూపిన బాటలోనే నడుస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రావిరాం సత్యం, యలమంచిలి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు దొడ్డి రవి, తిమ్మరాజుపేట కాంగ్రెస్ పార్టీ నాయకుడు, బీసెట్టి పెంటారావ్, కొటారు సత్యనారాయణ, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter