బల్క్ వేస్ట్ జనరేటర్ల నమోదు మరియు ఆన్ సైట్ కంపోస్టింగ్ విధివిధానాలు.
18/July/2026 21:40
Share:
యలమంచిలి,కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడో శనివారం జరిగే కార్యక్రమంలో జూలై నెల థీమ్ అయినటువంటి " * బల్క్ వేస్ట్ జనరేటర్ ఎన్యుమ రేషన్* -అనే అంశంపై స్వచ్ఛత కార్యక్రమాలు" ఈరోజు అనగా 18.07.2026 తేదీన స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర స్పెషల్ ఆఫీసర్ అరుణ గారు, మున్సిపల్ కమిషనర్ బి .జె .ఎస్ .పి రాజు గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్, సచివాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది తో స్థానిక మున్సిపల్ ఆఫీస్ నుంచి వెజిటబుల్ మార్కెట్ వరకు ర్యాలీగా వెళ్లి వెజిటబుల్ మార్కెట్ వద్ద వ్యాపారస్తులకు బల్క్ వేస్ట్ జనరేషన్ అనే అంశంపై అవగాహన కల్పించడం జరిగింది. సానిటరీ ఇన్స్పెక్టర్ వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉన్నందున ప్లాస్టిక్ వినియోగించిన యెడల చర్యలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. అనంతరం గౌరవ కమీషనర్ వారు మాట్లాడుతూ 100 కేజీల కంటే ఎక్కువ చెత్త ఉత్పత్తి చేయు ఏ సంస్థ అయినా బల్క్ వేస్ట్ జనరేటర్ పరిధిలోకి వస్తుంది అని ఆ పరిధిలోకి వచ్చే ప్రతి సంస్థ లేదా సముదాయం వారి యొక్క ఆవరణలోనే ఆన్ సైట్ కంపోస్టింగ్ చేసుకోవాలని అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్ వద్ద బల్క్ వేస్ట్ జనరేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించడమైనది. అనంతరం స్థానిక కొక్కిరపల్లి బాలికల వసతి గృహంలో ఏర్పాటుచేసిన బల్క్ వేస్ట్ జనరేటర్ ను సందర్శించి అక్కడ విద్యార్థులకు మరియు సిబ్బందికి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో నాలుగు రకాల చెత్త విభజన గురించి మరియు అక్కడి సిబ్బందికి బల్క్ వేస్ట్ జనరేషన్ పై పలు సూచనలు చేయడం జరిగింది. అనంతరం మున్సిపల్ కమిషనర్ గారు అక్కడి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు , సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తో స్వచ్ఛత పై ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ కె విజయ్ కుమార్, శా నిటరీ ,ఇన్స్పెక్టర్ పల్లా శ్రీనివాసరావు , శానిటేషన్ సెక్రటరీలు, వ్యాపారస్తులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.