కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు,
రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలంటూ జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్బంగా ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజే ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏపీబీజేఏ జిల్లా అధ్యక్షుడు నారాయణ మాట్లాడుతూ, సమాజానికి నాలుగో స్తంభంగా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేసే జర్నలిస్టులకు సరైన న్యాయం జరగడం లేదని, అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు కేటాయించడమే కాకుండా వృద్ధాప్యంలో ఉన్న జర్నలిస్టులందరికీ కూడా పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా.చంద్రబాబునాయుడు, డెప్యూటీ సీఎమ్ పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బిజెపి నాయకులు అందరూ కలిసి జర్నలిస్టులకు న్యాయం చేకూర్చే విధంగా మీ పరిపాలనలో కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు తెలియజేశారు.
ప్రధానంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను తక్షణమే అరికట్టేందుకు కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు జబీర్, సెక్రటరీ హరీష్, ఏపీ బిజీఏ అధ్యక్షులు నారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ కళ్యాణ్,జాయింట్ సెక్రటరీ వెంకటరావు, ఉపాధ్యక్షులు రిషి రావు, వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, శ్రీనివాస్, యూనియన్ నాయకులు శరత్, ఏలూరు టౌన్ సెక్రటరీ దండే.దొరబాబు, పిల్లి.మిల్టన్ ప్రతాప్, గేరా.సతీష్ కుమార్, సన్నీ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.