అచ్చుతాపురం నారపాక జంక్షన్ ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం అందజేత..!!

అచ్చుతాపురం నారపాక జంక్షన్ ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం అందజేత..!!

01/May/2026 08:20    Share:   

క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ యలమంచిలి :

అచ్చుతాపురం నారపాక జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ ఢీకొని కొల్లి వరహాలరావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన వారు కూడా చికిత్స పొందుతున్నారు.ఈ నేపథ్యంలో ఈరోజు అచ్చుతాపురం తహసిల్దార్, పరవాడ డీఎస్పీ, అచ్చుతాపురం సీఐ, రాంబిల్లి సీఐల ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలను పరామర్శించారు. పరిశ్రమ యాజమాన్యం తరఫున మృతుడి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. అలాగే ప్రమాదంలో గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రమాద బాధితులకు తక్షణ సాయం అందించడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.
Breaking News

Subscribe our Newsletter