క్రైమ్ అనాల్సిస్ | ఇంచార్జ్ - టివియస్ ప్రకాష్ :
ప్రజలకు రాజ్యాంగబద్ధంగా కల్పించబడిన సమాచార హక్కును అమలు చేయుటకు రూపొందించిన సమాచార హక్కు చట్టం–2005 ప్రకారం డి.ఎమ్.ఇ (DME) కార్యాలయానికి సమర్పించిన దరఖాస్తుపై చట్టపరమైన గడువు ముగిసినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి, పారదర్శకత లోపానికి నిదర్శనమని 'కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్' (NGO) ఆర్గనైజేషన్ తీవ్రంగా ఖండించింది.ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు జవాబుదారీతనం కలిగి ఉండాలని డిమాండ్ చేశారు. అయితే సమాచారం అందించడంలో జాప్యం చేయడం, దరఖాస్తులను పట్టించుకోకపోవడం ప్రజల హక్కులను కాలరాయడమే కాకుండా పరిపాలనా వైఫల్యాన్ని బహిర్గతం చేస్తోందని వారు ఘాటుగా విమర్శించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
గత ఒక సంవత్సరంగా అనేక మంది దరఖాస్తుదారులు సమర్పించిన వినతులను కూడా సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చేసిన నేపథ్యంలో, ఈ వ్యవహారాన్ని కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ ఆర్గనైజేషన్ తీవ్రంగా ఖండిస్తోంది.ఈ క్రమంలో కె.వి. రాఘవ్, సి.సి.ఆర్ సభ్యులు & ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్, చట్టబద్ధ హక్కును వినియోగిస్తూ సంబంధిత మొదటి అప్పీళ్ల అధికారికి అధికారికంగా మొదటి అప్పీల్/వినతిపత్రం సమర్పించారు.సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించిన బాధ్య అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న సమాచారాన్ని వెంటనే అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేనిపక్షంలో రాష్ట్ర సమాచార కమిషన్ సహా తదుపరి చట్టపరమైన పోరాటానికి వెనుకాడబోమని స్పష్టం చేస్తున్నాము.ప్రజల హక్కులను అణగదొక్కే ప్రతి ప్రయత్నాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ఎదుర్కొంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము.
కె.వి. రాఘవ్ సి.సి.ఆర్ సభ్యులు & ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ Email:
councilforcitizenrights@gmail.com