అనకాపల్లి  ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం

అనకాపల్లి ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం

08/February/2026 14:20    Share:   

అనకాపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎం వెంకట నారాయణ గారు సుంకరమెట్ట జంక్షన్ వద్ద ఉన్న స్పీడ్ బ్రేకర్‌పై ఇదివరకు  జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నియంత్రణ చర్యల్లో భాగంగా సంబంధిత అధికారులతో మాట్లాడి స్పీడ్ బ్రేకర్‌పై వైట్ పెయింట్ వేయించడం జరిగింది.
అదేవిధంగా, నూకలమ్మ ఆర్చ్, ఎన్‌హెచ్–16 వద్ద అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ జి. సత్యనారాయణ గారు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టూ వీలర్ వాహనదారులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తూ, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాల గురించి వివరించి, డ్రంక్ అండ్ డ్రైవ్‌ను పూర్తిగా నివారించాలని హితవు పలికారు.
Breaking News

Subscribe our Newsletter