సిఐటియు నాయకుల ఆరోపణ – లేబర్ కోడ్స్ కార్మిక హక్కులను అణచివేస్తున్నాయి

సిఐటియు నాయకుల ఆరోపణ – లేబర్ కోడ్స్ కార్మిక హక్కులను అణచివేస్తున్నాయి

16/April/2026 20:06    Share:   

          కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని నోయిడా కార్మికులు చేస్తున్న పోరాటానికి సిఐటియు మద్దతు.
వేతనాల పెంపు, ఇతర కార్మిక సమస్యలు పరిష్కరించాలని ఢిల్లీ ప్రాంతంలో కార్మికులు గత మూడు రోజులుగా 80 పరిశ్రమల్లో 45 వేలమంది కార్మికులు సమ్మె చేస్తున్నారు వీరికి మద్దతుగా అచ్యుతాపురంలో సంఘీభావం ప్రకటించి కార్మికులపై నిర్బంధాన్ని ఆపాలని నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ రాము, మండల కన్వీనర్ కె సోమునాయుడు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మికులపై కక్ష కట్టింది కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను తొలగించి నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది దీనివలన కార్మికుల హక్కులను అణిచివేయడం ద్వారా కార్పొరేట్ ప్రయోజనాలను కాపాడడానికి ప్రభుత్వం ఈ చట్టాలను మార్చింది వేతనాలు పెంపు కోసం ఆందోళన చేస్తున్న కార్మికులపై ఉత్తరప్రదేశ్ ,హర్యాన ప్రభుత్వాలు నిర్బంధాన్ని ప్రయోగించి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నది సంవత్సరాల తరబడి కార్మికులకు వేతనాలు పెంచాలని రాయబారాలు నడిపిన కనీస స్పందన లేకపోవడంతో గత మూడు రోజులుగా శాంతియుతంగా కార్మికులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ సమస్యని పరిష్కరించాల్సింది పోయి బిజెపి ప్రభుత్వాలు దీనికి భిన్నంగా కార్మికులను భయభ్రాంతులను గురిచేసి పోలీసులను రంగoలోకి దించి లాఠీచార్జి, అక్రమ అరెస్టులు చేసి కార్మికులను కిడ్నాప్ చేస్తున్నది సిఐటియు నాయకులను గృహనిర్బంధాలలో ఉంచింది. వేతనాలు పెంచాలని, పని ప్రదేశంలో భద్రత కల్పించి అక్రమ తొలగింపులు ఆపాలని, ఎనిమిది గంటల పని దినం అమలు చేయాలని తదితర డిమాండ్లతో సాగుతున్నది 300 మంది కార్మికులను అరెస్టు చేసి ఎక్కడ ఉంచారో కూడా సమాచారం అందించడం లేదు రోజుకు పదిగంటలు పని చేస్తున్న 300 రూపాయలు కూలీ రావడం లేదని కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు  కార్మికులు న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంఘాలతో చర్చించి వారి డిమాండ్లు పరిష్కరించాలని సిఐటియు డిమాండ్ చేస్తున్నది. రేపటినుండి నంద్యాల పట్టణంలో 17 నుండి 19 వరకు జరిగే సిఐటియు రాష్ట్ర మహాసభల్లో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యచరణ రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రాజన్న సత్తిబాబు, ఆటో యూనియన్ నాయకులు కర్రి నాయుడు,డి రాజశేఖర్, ఆర్ ఓనుముల నాయుడు, శివ, ఎస్ఈజెడ్, ముఠా కార్మికులు. తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter