*దూరదర్శన్ లో జిల్లా స్ట్రింగర్ల ఎంపానెల్‌మెంట్‌కు గడువు పెంపు
*ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల కోసం డీడీ న్యూస్ స్ట్రింగర్ల నియామకం
విజయవాడ, 20 ఫిబ్రవరి 2026.
దూరదర్శన్ న్యూస్ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ 2026 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కోసం వార్తల సేకరణ నిమిత్తం జిల్లా ప్రతినిధులు (స్ట్రింగర్ల) ఎంపానెల్‌మెంట్‌కు దరఖాస్తుల స్వీకరణ గడువు 10 మార్చి, 2026 వరకూ పొడిగించింది. జర్నలిజంలో అనుభవం కలిగిన వారిని నుంచి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు RNU (ప్రాంతీయ వార్త విభాగం), డీడీకే విజయవాడ హెడ్ ఆఫ్ న్యూస్ షఫీ మహమ్మద్, IIS ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి నెలలో ఒక ప్రకటన ద్వారా స్ట్రింగర్ల నియామాకానికి ఆహ్వనించిన గడువు 20 ఫిబ్రవరితో ముగుస్తోంది. అయితే ఈ ధరఖాస్తుల స్వీకరణ గడువును 10 మార్చి, 2026 సాయంత్రం 5 గంటల వరకూ పొడిగించడం జరిగింది. పాత్రికేయ రంగంలో అనుభవం, అభిరుచి ఉన్న ఇతరులు ఈ స్ట్రింగర్ల ఎంపానెల్మెంట్ కు ధరఖాస్తు చేయవచ్చు. ప్రసార భారతి నియమ నిబంధనలు అనుసరించి ఇతర సంస్థల్లో పని చేస్తున్న వ్యక్తులూ కూడా స్ట్రింగర్లుగా ఎంపికైతే దూరదర్శన్ లో కూడా వార్తలు అందించి అధనపు ఉపాధి పొందవచ్చును.
ఈ ఎంపానెల్‌మెంట్ ద్వారా జిల్లా స్థాయిలో వార్తలు, ప్రస్తుత వ్యవహారాలు, క్రీడలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి దూరదర్శన్ న్యూస్‌కు అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తుదారులు తాము దరఖాస్తు చేస్తున్న జిల్లాలోనే నివసిస్తూ, అక్కడే పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులు రూ.1,180 ప్రాసెసింగ్ ఫీజుతో కూడిన దరఖాస్తులను దూరదర్శన్ కేంద్రం, విజయవాడలోని ప్రాంతీయ వార్తా విభాగానికి సమర్పించాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 10 మార్చి, 2026 సాయంత్రం 5 గంటల వరకుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ఎంపానెల్‌మెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు మరియు దరఖాస్తు విధానం వంటి సమాచారం క్రింది నోటిఫికేషన్‌లో ప్రసార భారతి వెబ్ సైట్లో పొందుపరిచినట్లు వెల్లడించారు.
నోటిఫికేషన్ లింక్: ?
https://prasarbharati.gov.in/wp-content/uploads/2026/02/RNU-DDK-vijayawada-Stingers-corrigdm.pdf………………………………………………