డైట్ లో ఎంబీఏ,ఎంసీఏ,ఎంటెక్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే
05/May/2026 19:40
Share:
స్థానిక అనకాపల్లి దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ, ఆటోనమస్‌లో ఎంబీఏ, ఎంసీఏ మరియు ఎంటెక్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కే పి ఐ గ్రీన్ హైడ్రోజన్ & ఆమోనియా ప్రైవేట్ లిమిటెడ్. సీఈవో రోబ్బి రాజశేఖర్ గారు విచ్చేసి విద్యార్థులకు మార్గదర్శకంగా ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు తమ విద్యను సార్థకం చేసుకుని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని, నూతన ఆవిష్కరణలు మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ముందుకు సాగాలని సూచించారు. భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ వైకుంఠరావు గారు ప్రసంగిస్తూ, విద్యార్థులు క్రమశిక్షణ, కృషి మరియు నిబద్ధతతో తమ లక్ష్యాలను సాధించాలని అన్నారు. విద్యార్థుల విజయమే సంస్థకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తీర్ణులైన ఎంబీఏ , ఎంసీఏ మరియు ఎంటెక్ విద్యార్థులకు పట్టాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ పి బి రామ్ కుమార్, ఎంసీఏ మరియు ఎంటెక్ విభాగాధిపతి డాక్టర్ కే సుజాత మరియు డాక్టర్ పి పూర్ణ ప్రియ అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.