వ్యవసాయ అధికారి మోహన్ రావు ఆధ్వర్యంలో విస్తృతంగా ఎరువుల దుకాణాలు తనిఖీ
01/May/2026 08:18
Share:
యలమంచిలి మండలంలో మండల వ్యవసాయ అధికారి మోహన్ రావు ఆధ్వర్యంలో ఎరువులు దుకాణాలను మండల టాస్క్ ఫోర్సు సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేసారు. దుకాణాలలో ఎరువుల లభ్యత ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు లైసెన్సుడు జారీ చేయబడిన దుకాణదారులు ఎప్పటికప్పుడు ప్రభుత్వం వారి సూచనలు మేరకు ఆధార్ మరియు పట్టాదార్ పాస్ పుస్తకాలు దృష్టిలో పెట్టుకొని పంటల సరళని బట్టి ఎరువులను రైతులకు సరఫరా చేయాలని ఎట్టి పరిస్థితుల్లోని స్టాక్ నిల్వ మరియు ఈ పాస్ మిషన్ లో డేటా సరిపోయేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తూ అట్లా లేనియెడల శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది తాసిల్దార్ ఎలమంచిలి ఎంపీడీవో ఎస్సై సిబ్బంది ఉండగా రాబోయే ఖరీఫ్ సీజన్లను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఎరువుల దుకాణాలను తనిఖీ చేస్తారని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ విజయరామరాజు పిఎసిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.