పాలకొండవిల్లి వరద ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బేబీనాయన..

పాలకొండవిల్లి వరద ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బేబీనాయన..

25/September/2026 18:17    Share:   

పాలకొండవిల్లి.
గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో వరద నీరు నిల్వ ఉండిపోయినందున, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు. పాలకొండవిల్లి నుంచి టీడీలర్ ధియేటర్ మార్గంలో వరద నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
దీంతో ఎమ్మెల్యే బేబీనాయన స్వయంగా పాలకొండవిల్లి ప్రాంతానికి వెళ్లి వరద పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డుపై నిలిచిపోయిన నీటిని పరిశీలించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న గట్లను తొలగించి నీరు సాఫీగా పారే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఒక ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. 

క్రైమ్ అనాలసిస్ విజయనగరం జిల్లా ఇంచార్జ్ మందపాటి సూర్యనారాయణ రాజు
Breaking News

Subscribe our Newsletter