సింహాచలం గోశాలలో ఘనంగా

సింహాచలం గోశాలలో ఘనంగా 'శబల భోజనాలు'.. యూజేఎఫ్ డైరీని ఆవిష్కరించిన ప్రముఖులు

03/April/2026 19:20    Share:   

యుజేఎఫ్ సేవలు అభినందనీయం,సెంచూరియన్ యూనివర్సిటీ ఛాన్స లర్ ఆచార్య జిఎస్ఎన్ రాజు     
విశాఖపట్నం,ఉత్తరాంధ్ర సామాజిక కార్యక్రమాల్లో యూజేఎఫ్  తమ వంతుగా సేవలందించడం అభినందనీయమని సెంచూరియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ ఆచార్య జి.ఎస్.ఎన్ రాజు అన్నారు. సింహాచలం గోశాలలో శబల భోజనాలు పండుగ మూడో రోజు కార్యక్రమానికి ఆయన హాజరై యుజేఎఫ్ డైరీ ని ఆవిష్కరించారు. ఉత్తరాంధ్ర జర్నలిస్టుల ఫోన్ నెంబర్లు, ఇతర సమాచారంతో ప్రతి ఏటా ఉగాది పండుగ నేపథ్యంలో హ్యాండ్ బుక్ ను ఉత్తరాంధ్ర జర్నలిస్ట్స్ ఫ్రంట్ ( యూజేఎఫ్ ) విడుదల చేయడాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూజేఎఫ్ అధ్యక్షులు డాక్టర్ ఎం.ఆర్.ఎన్ వర్మ, సేవ్ సంస్థ వ్యవస్థాపకులు విజయరాం, ఫుడ్ ప్రాసెసింగ్ రాష్ట్ర విభాగం  కార్యదర్శి చిరంజీవి చౌదరి, అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ విజయ ప్రసాద్, భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యులు జలగం కుమారస్వామి, పోర్టు హార్టికల్చర్ అధికారి రాధిక, భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ సంరక్షకులు భాగవతుల శ్రీరామ్, జిల్లా అటవీ శాఖ అధికారి రవీంద్ర ధామా, సంకల్ప కళా గ్రామం నిర్వాహకులు ఆకులు చలపతిరావు, తులసి ఆర్గానిక్ సత్యనారాయణ, గ్రీన్ క్లైమేట్ జే.వి రత్నం, యూజేఎఫ్ ప్రతినిధులు డి.ఎస్. ఎస్.ఎస్.కే హరనాథ్, జి.సత్యనారాయణ, సీనియర్ జర్నలిస్ట్ పి.యు.ఎస్ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter